రాయల్ పోస్ట్ న్యూస్ మేడ్చల్ జిల్లా ,జవహర్ నగర్.:
బాలల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా స్వేచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ చిరివెనీ రాజు ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో బాలల హక్కుల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వేచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ చిరివెని రాజు మాట్లాడుతూ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వందల మంది పిల్లలు బడికి పోలేక వివిధ రకాల వృత్తుల కు వెళుతూ బాలకార్మికులుగా బాల్యమంతా బానిస అయిపోతుంది, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్న ప్రభుత్వాలు పిల్లల హక్కులను కాపాడే లేకపోతున్నాయి, ఏదో చోట ఏదో ఒక క్షణం నా పిల్లల పైన అనర్ధాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో బాల్యవివాహాలు కు గురవుతున్నారు, ఎంతో మంది పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. పోస్కో లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పటిష్టంగా అమలు చేయకపోతే పిల్ల ని పట్టించుకునేవారు ఎవరు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా పిల్లల గురించి పట్టించుకోని బడి పిల్లలు అందరు బడికి పోయే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సగానికిపైగా బస్తాలు బస్సు సౌకర్యం లేదు ఈ దృష్ట్యా ప్రభుత్వం పట్టించుకోని ప్రతి బస్తీ కి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి క్షేమంగా పిల్లల్ని బడి నుండి ఇంటికి చేర్చాల్సిన. బాధ్యత తీసుకోవాలని కోరుతున్న. ఈ కార్యక్రమంలో లో ఈ సంస్థ ప్రతినిధులు పుష్పలత, పద్మ, మరియు బస్తీవాసులు మస్తాన్, నరసింహ, తిరుపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు