రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి:నిత్యావసర ధరలు రోజు రోజుకూ పెంచుతూ సామాన్య పేదలపై ప్రభుత్వాలు పెను భారాలు మోపుతూ పాలన కొనసాగిస్తున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. భువనగిరి పట్టణంలో కేంద్రలో ఐద్వా ఆద్వర్యంలో కూరగాయలు దండ పట్టుకుని వినూత్న నిరసన తెలపడం జరిగింది ఈ సందర్బంగా అనురాధ మాట్లాడుతూ ఎడేండ్ల మోడీ పాలనలో దేశంలో ధరలు ఆకాశానికి అంటాయి.గ్యాస్,పిట్రోల్,డిజిల్ ,నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జీవనం దుర్బరంగా మారుతున్నా పాలకులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా మూలంగా పని దోరకక పేదలు ఇబ్బందిపడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు అన్న చందంగా అధిక ధరలతో మోయలేని భారమవుతుంది. ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. పెట్రోల్ 5 రూపాయలు తగ్గించి నందుకు ఆడంబర ప్రచారం చేసుకున్న ప్రభుత్వం డిజిల్ ,పెట్రోల్ పై ఆదారపడే నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు తగ్గించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయకార్యదర్శి దాసరి మంజూల, జిల్లా కోశాదికారి కల్లూరి నాగమణి,జిల్లా కమాటి సభ్యులు దండు స్వరూప,పట్టణ నాయకురాలు మాటూరి కవిత,హేమలత,ఝాన్సీ,లక్ష్భి,నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.