రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ : జిల్లాలోని సిరికొండ మండల కేంద్రంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం రైతులు కష్టపడి పంట పండించడం మొదలుకొని కొనుగోలు సెంటర్ల దగ్గరకు వచ్చేసరికి సచ్చి బ్రతికినంత పనైతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు భయపడాలో ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్లక్ష్యానికి ఆందోళనకు గురవుతున్నారు. ఐ. కె. పి సెంటర్ సిరికొండ మండల కేంద్రంలోని అధికారుల నిర్లక్ష్యానికి రైతులు నష్టపోతున్నారు. వరి కొనుగోలు సెంటర్ లో అధికారులను రైతులు అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానం రైతులకు ఎదురవుతుంది ఏ రైతు అయినా ప్రశ్నిస్తే పండించే పంట నష్టపోతామనే భయంతో రైతులు ఉన్నారు వడ్లు జోకిన కానీ వాటిని రైస్ మిల్లు కు తరలించడానికి లారీలు లేవనే నిర్లక్ష్యపు సమాధానం వడ్లు జోకిన వాటికి రైస్ మిల్లర్లు క్రాక్ సీట్ ఇవ్వలేదని నిర్లక్ష్యపు సమాధానమిస్తున్న అధికారులు ఒక్క రైతుకు క్వింటాలుకు ఎంత కోత పెడుతున్నారని ఏ ఒక్క రైతుకు కూడా తెలవని స్థితిలో ఉన్నారు తెగించి అడిగితే మరొక పంటకు ఎంత నష్టం చేస్తారనే అయోమయంలో రైతులు ఉన్నారు.