రాయల్ పోస్ట్ న్యూస్ కరీంనగర్: అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులకు జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రథమ స్థానం విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కల్పించాలని మరియు వాటికి కావల్సిన వనరులను సమకూర్చాలని తద్వారా సమాజంలో ముందంజలో నిలువవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా ॥ వి . నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు . పాల్గొన్నారు . తేది . 16-11-2021 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే వివిధ క్రీడల్లోని విషయాలను తెలిపి , శిక్షణ ఇప్పివ్వాలని కోరారు . క్రీడారంగం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పాఠశాలలో నిపుణులైన వ్యాయామ అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలుపుతూ పాఠశాల స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన విద్యార్థులకు చేయూతనిచ్చి వివిధ స్థాయిలలో పాల్గొనింపేలా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు . ఈ క్రమంలో ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ చెన్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో నిర్వహింప బడినటువంటి కరీంనగర్ ఓపెన్ చెన్ టోర్టమెంట్ లో అల్ఫోర్స్ పాఠశాలలకు చెందినటువంటి 4 గురు విద్యార్థులు అసమాన ప్రతిభను కనబర్చి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని తోటి క్రీడా కారులకు ఆదర్శంగా నిలచారని ప్రశంచించారు . టి . విశాల్ , 7 వ తరగతి , ప్రథమ స్థానం , ఎం . నిహారిక , 10 వ తరగతి , ప్రథమ స్థానం , టి . వినీల , 10 వ తరగతి , ద్వితీయ స్థానం మరియు జె , సహస్ర , 6 వ తరగతి , ద్వితీయ స్థానాన్ని పొందారని హర్శం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో రెట్టింపైన పోటీతత్వంతో జయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షింస్తూ విజేతలకు పుష్ప గుచ్చాలను అందచేసి అభినందించారు . ఈ కార్యక్రమంలో శాలల ప్రిన్సిపాల్స్ , ఉపాధ్యాయ బృందం విద్యార్థులు