జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన గజెల్లి

రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల :జిల్లా కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్చంద సేవా సంస్థ, హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ కార్యదర్శి అధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిరు పేదలకు 100 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిల ఉంటూ ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్న జర్నలిస్ట్ మిత్రులు నిజాన్ని నిర్భయంగా నిస్వార్దంగా తమ గళం తో, తమ కలం తో ప్రజా స్వామ్య దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన పౌరా హక్కులను బావా ప్రకటన స్వేచ్ఛను తమ ప్రభుత్వాలకు బాగ ఉదని మీడియా ను వారి హక్కులను హరించె పాలక వర్గాల, ప్రభుత్వల కుట్రలను చేధించి ప్రజా స్వామ్యం లో 4th ఎస్టేట్ ఐనా పత్రికా రంగాన్ని, యాజమాన్యాని పాత్రికేయులను రక్షించుకోవల్సిన బాద్యత ప్రజలందరి పైన ఉన్నదని పేర్కొన్నారు… ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, సీనియర్ పాత్రికేయ మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి లలిత వెంకటయ్య పాల్గొన్నారు..