: ఎస్ కె. సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ జైనూర్:

జంగాం గ్రామ పంచాయతీ లో ప్రారంభానికి సిద్ధమైన వాటర్ ప్లాంటు కొమురం భీమ్ జిల్లా జైనూర్ మండలం లోని జంగాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రోత్సాహం తో మరియు బాల వికాస సౌజన్యముతో ప్రారంభానికి సిద్ధమైనట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ కుంర.శ్యామ్ రావ్,వైస్ ఎం పి.పి.చీర్ల. లక్ష్మణ్ యాదవ్, ఉప సర్పంచ్, సయ్యద్ చాంద్, పంచాయతీ కార్యదర్శి చేన్న మధుకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామ పంచాయతీ లో 10 హ్యాబిటేషన్ లు ఉన్నాయని అన్నారు. పోడుభూముల సమస్యలను పరిష్కరించేందుకు 7 ఎఫ్ ఆర్ సి కమిటీ లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 400 దరఖాస్తులను కమిటీ లకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరికి వాటర్ ప్లాంట్ ఏనీ టైమ్ వాటర్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫారిద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు