ఎస్ కె సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ జైనూర్:

షేగాం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పోడు భూముల దరఖాస్తుల స్వీకరణషేగాం కొమురం భీమ్ జిల్లా జైనూర్ మండలం లోని ఉషేగాం గ్రామ పంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పాలనధికారి అదేశముల మేరకు పోడుభూముల సమస్యల పరిష్కరించాలని గ్రామ పంచాయతీ లోని గిరిజన మరియు గిరిజనేతరుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊయక రమాకాంత్, ఉప సర్పంచ్ గెడం లలిత,పంచాయతీ కార్యదర్శి పెంటు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ సి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు