రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: స్థానిక మదరసా ఖదీమ్ జామియా ఇస్లామియా అరేబియా జలీల్‌పురాలో దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు బుర్హాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, నిజమైన దేశభక్తుడని.. జవహర్‌లాల్ నెహ్రూకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని,అన్నారు విద్యారంగంలో వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. దేశ యువత మరియు చదువుకున్న పిల్లలే దేశానికి ఉజ్వల భవిష్యత్తు అని అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన విద్యను అభ్యసించాలని ఆయన కోరారు.కమిటీ చైర్మన్ షేక్ మీరాన్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి, పరిశోధనలతో విద్యను అభ్యసించాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకుడు బుర్హాన్ వారి అన్న అస్గర్ అలీని అభినందించారు. విద్యార్థులు ఈ పాఠ్యపుస్తకాలను పూర్తిగా ఉపయోగించుకుని, వారి విద్యా పనితీరును మెరుగుపరుచుకోవాలి అని అన్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ లీడర్ బుర్హాన్ మరియు వారి అన్న అజ్ఘర్ అలీ 30వేల రూపాయల పాఠ్యపుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మౌలానా శోబరహ్మన్, మౌలానా దస్తగిర్, హైదర్ అలీ, ఆమెర్, మన్సూర్, రహీం, హాసనుద్దీన్, సుజావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.