దళిత గిరిజనులపై దాడులను వెంటనే హరికట్టాలి

ఎల్ బి నగర్ (రాయల్ పోస్ట్ న్యూస్) : రాష్ట్రంలో తరుచు దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం మనుసురాబాద్ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం ఉపాధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కుతాడి కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు దళిత గిరిజనల పై దాడులు పెరిగిపోతున్నాయని దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు నిందితుల పట్ల అండగా ఉండడం సరైన చర్య కాదన్నారు. ప్రభుత్వాలు అగ్రవర్ణాలకు తొత్తుగా మారి పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసి గిరిజన ప్రజలపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే కాలంలో దళిత గిరిజనులు కలిసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో దళిత సంఘం నాయకులు ఇరిగి రమేష్ అంబేద్కర్ సంఘం నాయకుల పారంద స్వామి, ఎరుకల సంఘం నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.