గిరిజనుల పై అక్రమ కేసులు బానాయించిన యస్. ఐ. పై చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని ఎస్పీ కి పిర్యాదు

రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి :: కులం పేరుతో దూషించి తన రివాల్వర్ తో భయబ్రాంతులకు గురి చేసి, తిరిగి తమపై తప్పుడు కేసుల పెట్టిన జహీరాబాద్ రురల్ ఎస్సై రవి పై తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోహీర్ మండలం సెరియగట్టు తండా గిరిజనులు జిల్లా ఎస్పీ రమణ కుమార్ కి పిర్యాదు చేశారు . సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి సిరియాగుట్ట తండా గిరిజనులు దీపావళి పండుగ చేస్కుంటుండగా జహీరాబాద్ రూరల్ ఎస్సై రవి, కానిస్టేబుల్ సివిల్ లో, ప్రైవేట్ వాహనం లో కోహిర్ మండలం సీరియగుట్ట తండా లో ప్రవేశించి ఒక విద్యార్థి ఇంట్లోకి వెళ్లి అక్కడి ఉన్న మహిళ కాలు తొక్కి కించపరిచేలా మాట్లాడుతుండగా తండా వాసులు అతనిని ప్రశ్నించగా తన వద్ద ఉన్న రివాల్వర్
చూపించి
భయబ్రాంతులకు గురిచేసాడని, పైగా 5 మంది పై తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు. యస్. ఐ.
ఒకే సమయంలో మూడు గ్రామల్లో విధులు నిర్వహిస్తున్నట్టు తప్పుడు రికార్డులు సృష్టించడాని తండా వాసులు తెలిపారు. వారి విజ్ఞప్తి పై స్పందించిన జిల్లా ఎస్పీ ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి విచారణ చేయిస్తానని, తమకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారని సెరియగట్టు తండా గిరిజనులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయక్, వాసు నాయక్, రాజ్ కుమార్ , భీమ్లా సింగ్, చందు నాయక్ , ప్రేమ్ సింగ్ , విఠల్, కిషన్, గబ్బర్ సింగ్ , చందర్ చవాన్ తదితరులు పాల్గొన్నారు….