అల్ఫోర్స్ టైనీటాట్స్ విద్యార్థినికి బాలరత్న అవార్డు

రాయల్ పోస్ట్ న్యూస్ కరీంనగర్:విద్యార్థులకు విద్యతో పాటు వినోదం చాలా అవసరమని, దీని వలన ఒత్తడి నుండి ఉపశమనం కలుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత
డా ॥ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాలపల్లి లోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన సభకు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి ముందజలో ఉండాలని . చెప్పారు . ప్రత్యేకంగా విద్యార్థులు పోటీతత్వంతో పాటు ఆలోచన శక్తిని మెరుగు పరుచు కోవాలని, వివిధ పోటీలలో పాల్గోని అసమాన ప్రతిభను కనపరచాలని కోరారు . నేడు మన భారతదేశంలో ఎన్నో కోత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వాటి అన్నిటి పట్ల కనీస అవగాహన ఉండడం ప్రధాన కర్తవ్యంగా మారిందని చెప్పారు . తరగతి గదిలో విద్యార్థులకు భోదన సమయంలో ఏర్పడే ఒత్తిడి, చికాకును అధిగమించడానికై పాఠశాల పాఠ్యాంశ ప్రణాలికలో సంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కళల పట్ట పట్టున్నవారికి తగిన ప్రోత్సాహకాలను అందజేస్తూ వారిని అన్ని రకాలుగా సిద్దము చేస్తున్నామని చెప్పారు . ఈ క్రమంలో ఇటీవల కాలంలో రాష్ట్ర రాజధాని హైద్రాబాద్లో ప్రముఖ కళా సంస్థయిన సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ వారు
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైద్రాబాద్ లో నిర్వహించిన పలు కార్యక్రమాలలో అసమాన ప్రతిభను కనపర్చిన
కె . ఆరాద్య అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతిష్టాత్మకమైన బాలరత్న అవార్డును కైవసం చేసుకోవడం చాలా గర్వించ దగ్గ విషమైని తెలుపుతూ, భవిష్యతులో జరుగ బోయే పలు కార్యక్రమాలలో కూడా జేయకేతనం ఎగరేవేయాలని ఆకాంక్షించారు
అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తు విద్యార్థినికి పుష్పగుచ్చంతో పాటు జ్ఞానిపకను ప్రధానం చేసి సన్మానించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , తల్లిదండ్రులు , ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు