రాయల్ పోస్ట్ న్యూస్ లాలపెట్: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఉన్నత విద్యాబుద్ధులు అలవర్చుకోవాలని విద్యా

మందిర్ హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సాలమాన్ అన్నారు. హైదరాబాద్ లాలాపేట లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకొని ఈరోజు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లాలాగూడ ఎస్ఐ ఆంటోనీమ్మ హాజరై విద్యార్థి తరగతి లో ఉన్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా మందిర్ హై స్కూల్ స్థాపించి 40 సంవత్సరాలు అవుతుందని, హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నతస్థాయి కి వెళ్లారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే నాయకత్వ లక్షణాలు అవలంబించు కొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు.