రేషన్ బియ్యం పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

రాయల్ పోస్ట్ న్యూస్ మల్కాజ్గిరి: ప్రభుత్వం సరఫరా చేసే పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

దేవేందర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నాచారం లో తిరుగుతూ ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు

స్థానికుల సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి దేవేందర్ ను అదుపులోకి తీసుకున్నారు

దేవేందర్ వద్ద నుండి 13 quintal బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నాచారం పోలీసులకు అప్పగించారు

నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు