మృతురాలి కుటుంబానికి పరామర్శించిన ఎల్లెంలా సంజీవరెడ్డి

రాయల్ పోస్ట్ (తెలుగు దిన పత్రిక)/మోట కొండూరు : మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన అనంతుల సత్య లక్ష్మి కుటుంబ సభ్యులైన అనంతుల నర్సిరెడ్డి, తిరుమల్ రెడ్డిని మోటకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లెంలా సంజీవరెడ్డి పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు, వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తండ పాండురంగయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వంగపల్లి మహేందర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, బుగ్గ సతీష్ తదితరులు పాల్గొన్నారు.