సిద్ధులు రాయల్ పోస్ట్ న్యూస్ అలేర్:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వరం నిర్వహించిన టాలెంట్ టెస్టులో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆలేరు ఎస్ ఐ ఇద్రిస్ ఆలీ మరియు సీనియర్ జర్నలిస్ట్ తిరునగరి శ్రీనివాస్ మరియు ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్ వారి చేతుల మీదుగా బహుమతులు గెలుచుకున్న విద్యార్థులు మొదటి బహుమతి గూడ పార్థసారథి, ద్వితీయ బహుమతి వల్లాల అర్జున్ మరియు కొలనుపాక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని అఖిల కు తృతీయ బహుమతి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ ఇద్రిస్ ఆలీ మాట్లాడుతూ ఇప్పుడు చిన్న వయసులో ఎన్నో ఎగ్జామ్స్ రాశి ఎన్ని రోజుల్లో మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు విన్నపం చేస్తున్నాను ఈ కార్యక్రమంలో లో బజరంగ్ యూత్ అధ్యక్షులు శివ శివ, మొరిగడి వైకుంఠం, లక్కాకుల సంతోష్, అయిలి శివ, భేతి నాగరాజు, బరిగే వెంకటేష్, క్రాంతి, వినయ్ భాను తదితరులు పాల్గొన్నారు