●తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో రాంజీ గోండ్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం●

మంచిర్యాలబెల్లంపల్లి రాయల్ పోస్ట్ న్యూస్: పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దివంగత ప్రెస్ రిపోర్టర్ జయరాజ్ గారి జ్ఞాపకార్థకం వారి కుటుంబ సభ్యుల సహకారంతో రాంజి గోండ్ ఆశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాళ్ళగురిజాల ఎస్ ఐ సమ్మయ్య గారు పాల్గొనడం జరిగింది. తదనంతరం ఆయన మాట్లాడుతూ జయరాజ్ గారి సేవలు మారువలేనివని, ఆయన జ్ఞాపకార్థకం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అన్నారు . ఈ కార్యక్రమం సందర్భంగా తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా మాట్లాడుతూ జయరాజ్ తన చిన్ననాటి స్నేహితుడని అన్నారు. సమయం స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయని కానీ వాటి విలువ వాటిని కోల్పోయినప్పుడు తెలుస్తుందని అన్నారు. జయరాజ్ మాతో లేడనే బాధ అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో ఉన్న అతని జ్ఞాపకాలతో బ్రతుకుతున్నామని అన్నారు.అదేవిధంగా జయరాజ్ కుటుంబ సభ్యులతో ఆశ్రమంలో పిల్లలకు అన్నదానం చేద్దామని చెప్పడంతోనే వారు వెంటనే స్పందించి సహకారం అందించి వారి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జయరాజ్ కుటుంబ సభ్యులు, తాజ్