సుభాన్ (రాయల్ పోస్ట్ )న్యూస్: మంచిర్యాల జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఎన్నికలలో మన బెల్లంపల్లి డివిజన్ నుంచి ఒకే ఒక నామినేషన్ రావడంతో జిల్లా ఎన్నికల అధికారి పెద్దలు గౌరవనీయులు శ్రీ నలుమాస్ కాంతయ్య గారు జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు చెట్ల రమేష్ గారు మరియు జిల్లా అధ్యక్షులు ముక్త సీనన్న గారి సహకారము తో ఆ నామినేషన్ను స్క్రూటినీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తూ ఒకే ఒక నామినేషన్ రావడంతో నన్ను అధ్యక్షునిగా డిక్లేర్ చేయడం జరిగింది. నేను(రేనికుంట్లశ్రీనివాస్) అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన బెల్లంపల్లి డివిజన్ మండల,పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులకు, జిల్లా కౌన్సిల్ సభ్యులకు కు మరియు బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘాల సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.