రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరుగుతున్న 5 వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు మరియు జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు…
కార్యక్రమంలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ట్రిపుల్ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత తెలంగాణ హాకీ సెక్రెటరీ పద్మశ్రీ ముకేశ్ కుమార్ గారు,యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు శ్రీ బుయ్య కిరణ్ కుమార్ గౌడ్ గారు, సువాలి ఎస్టేట్స్ చైర్మన్ శ్రీ సుభాష్ రెడ్డి గారు,భువనగిరి మున్సిపల్ చైర్మన్ A. ఆంజనేయులు గారు,బీబీనగర్ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ గారు,వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య గారు,భువనగిరి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు AV కిరణ్ గారు,సీనియర్ నాయకులు ఎడ్ల రాజేందర్ రెడ్డి గారు, కౌన్సిలర్ పంగ రెక్కల స్వామిగారు, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు…