రాయల్ పోస్ట్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభాన్ పాషా బెల్లంపల్లి,:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ని అక్రమ అరెస్ట్ చేయడాన్ని బెల్లంపల్లి సీపీఐ పార్టీ తరుపున ఖండిస్తూ ,భగత్ సింగ్ చౌరస్తా రోడ్డు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాపోరాటాలకు పిలుపునిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణని అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని అన్నారు. రైతు సమస్యలు పట్టించుకోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులను నారాయణ సూటిగా ప్రశ్నించి వెంటనే రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాసంగి, వరి గింజలు కొనాలని డిమాండ్ చేశారు.. రైతు పక్షాన ఉన్న నారాయణని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.