అరుణ రాయల్ పోస్ట్ ఆత్మకూర్ :

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక చేయూత
యువజన కాంగ్రెస్ కార్యకర్త ఎలిమినేటి మచ్చగిరి గారి తండ్రి మొగులయ్య అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య గారి సహకారంతో 5000 రూపాయలను సర్పంచ్ జన్నాయికోడె నగేష్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్ధులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేష్ గౌడ్ వార్డ్ మెంబర్లు ఎలిమినేటి మురళి, బొబ్బలి అంజిరెడ్డి, రజక సంఘం అధ్యక్షులు వేలిమకన్నే సతీష్ నాయకులు నాగం లక్ష్మారెడ్డి, ఎద్దు వెంకన్న, మాద రాంబాబు, తొండల అనిల్, పెరబోయిన మధు,గడ్డం బాషా,లోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.