రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు మహిళలు ఉద్యమాలు చేపట్టాలి…… ఎం పి పి నిర్మల వెంకటస్వామి. మహిళలకు ఓటు హక్కు, ఆస్తి హక్కు, స్వేచ్చా సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులను అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు మహిళలు ఉద్యమాలు చేపట్టాలని భువనగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు నరాల నిర్మల వెంకటస్వామి కోరారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను (48వ వారం) సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల నాయకుడు, భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన అంబేద్కర్ త్యాగం గొప్పదని ఆమె అన్నారు. జ్ఞానమాల ఉద్యమం తో కేంద్ర ప్రభుత్వం కు కనువిప్పు కలుగాలని ఆమె తెలిపారు. ఈ జ్ఞానమల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ , భువనగిరి మండల రైతు సమన్వయ కమిటీ చైర్మన్ కంచి మల్లయ్య,సాధన సమితి జిల్లా నాయకులు బండారు రవివర్దన్, బర్రె సుదర్శన్, భానోతు భాస్కర్ నాయక్ ,ఇటుకల దేవేందర్ బొడ్డు కృష్ణ ,బుగ్గ రమేష్, రావుల రాజు,నరాల వెంకటస్వామి,తదితరులు పాల్గొన్నారు.