అంబేద్కర్ చిత్రపటానికి, జై భీమ్ సినీ నటుడు సూర్యకు క్షీరాభిషేక.

ఆలేరు రాయల్ పోస్ట్ న్యూస్ / యాదాద్రి: భువనగిరి జిల్లా. ఆలేరు పట్టణ నగర పురపాలక ఆరో వార్డు బహదూర్ పేట లో స్థానిక వాడు కార్యాలయం వద్ద అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి, సినీ నటుడు సూర్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, సినీ నటుడు సూర్య చాలా అద్భుతంగా నటించారని, సూర్యుని చూస్తే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసునిగా నటించానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, సెక్రటరీ జనరల్ కుండే సంపత్, జంపాల శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు పల్లె మహేష్,కుళ్ళ సాయిలు,అంబేద్కర్ యూత్ సభ్యులు దొంతుల ఎల్లేష్, దొంతుల సరేష్, దొంతుల రాములు,దొంతులు రాజు, కళ్యాణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.