రైతు వేదన దీక్షకు బయలుదేరిన వైఎస్సార్ టిపి నాయకులు

(రాయల్ పోస్ట్ ప్రతినిధి)
హైదరాబాద్:వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల రైతు వేదన దీక్షకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గ కోకన్వీనర్ మామిడి రామచందర్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నుండి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు 100 మంది రైతులు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే రైతు వేదన దీక్షకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మామిడి రామచందర్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేసి కేంద్రప్రభుత్వంపై నెట్టివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.కేసీఆర్ రైతులను తప్పుత్రోవ పట్టిస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నన్నారు.బంగారు తెలంగాణ అని చెప్తూ రైతులను మోసం చేస్తూ వస్తున్నరన్నారు. రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం ఉదృతం చేస్తామని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో
పత్తి అజయ్ కుమార్,పుట్ట యాద్దయ్య,రవి,భిక్షపతి,రాంబాబు,వెంకటేష్,జంగీర్, ప్రశాంత్,మహేష్,రాము తదితరులు పాల్గొన్నారు.