అరుణ (రాయల్ పోస్ట్)ప్రతినిధి ఆత్మకూర్ యాదాద్రి భువనగిరి:
ఆత్మకూరు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడైన మేడే కిష్టయ్య గారు శనివారం అనారోగ్యంతో మరణించారు. గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు వారి మృత దేహం పై పూల మాల వేసి నివాళులర్పించారు.వారి దహన సంస్కారాలకు గాను గ్రామ పంచాయతీ తరపున గ్రామ సర్పంచ్ జన్నాయికోడే నగేష్ మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గార్ల చేతుల మీదుగా 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్, కో ఆప్షన్ మెంబర్ యాస లక్ష్మారెడ్డి,వార్డు సభ్యులు పoజాల పద్మ నర్సయ్య,కోరే మల్లేశం, ఉగ్గే మహాలక్ష్మి నరేష్, బొబ్బల అంజి రెడ్డి,వేముల లావణ్య నర్సింహా, లోడి శ్రీనివాస్ గౌడ్, లోడి నాగమణి ఐలయ్య గౌడ్, ఎలిమినేటి మురళి,తదితరులు పాల్గొన్నారు.