భువనగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్
వాటర్ సప్లై,పబ్లిక్ హెల్త్,
INTUC కార్మికుల సమావేశం

కార్యవర్గ
అధ్యక్షునిగా పడిగెల ప్రదీప్ ఎన్నిక

రాయల్ పోస్ట్ దిన పత్రికభువనగిరి : భువనగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్
వాటర్ సప్లై,పబ్లిక్ హెల్త్,
INTUC కార్మికుల సమావేశం ఈరోజు స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం భవనంలో నిర్వహించడం జరిగింది కార్మికుల యొక్క సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై కార్మికుల యొక్క అందరి అభిప్రాయ సేకరణ చేసి కార్యవర్గ ఎన్నిక నిర్వహించడం జరిగింది అధ్యక్షునిగా ఏకగ్రీవంగా పడిగెల ప్రదీప్ ను ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా శ్యామల రమేష్ కోశాధికారి గాయపాక రమేష్,కూరెళ్ళ యాదగిరి ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటు 30 మంది సభ్యులు కమిటీలు ఎన్నుకోవడం జరిగింది ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ గౌరవ సలహాదారులగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ అయినటువంటి పబ్లిక్ హెల్త్, వాటర్ సప్లై,కాంట్రాక్ట్ కార్మికులకు పని భారం పెరుగుదల అవుతుందని అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పిఆర్సి,సరెండర్, పీఎఫ్,ఈఎస్ఐ,ఇంక్రిమెంట్, డిఆర్ఎస్,మెడికల్ లీవ్ కు సంబంధించిన జీతాలు వాళ్లకు రావాల్సిన హక్కులను అన్నింటిని కాలరాస్తున్నారని దీనిపైన ఐక్య పోరాటంతో సాధించుకుంటామని కార్మికులందరూ ఐక్యమత్యంతో మాకు రావాల్సిన హక్కులను మా పని విధానాలన్నీ సాధించుకుంటామని సమావేశంలో తీర్మానించడం జరిగింది నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈకార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ 27వ వార్డు కౌన్సిలర్ నజీమా సలావుద్దీన్ కాంగ్రెస్ నాయకులు ఎండి,యూసుఫ్ మున్సిపల్ యూనియన్ నాయకులు మేకల ఇంద్రసేన కనుకుంట్ల కృష్ణ సిహెచ్ కుమార్ నరేందర్ బర్రె శ్రీధర్ డప్పు ఈశ్వరయ్య రాజు ఎడ్ల ఈశ్వరమ్మ చల్ల జయలక్ష్మి హంస రంగాపురం మహేష్ నర్సింగ్ రావు తోట నారాయణ సత్యనారాయణ బండారి శేఖర్ శంకరయ్య మైసయ్య గుడ్డంకి రాములు వందమంది కార్మికులు పాల్గొనడం జరిగింది