ప్రతిభ పురస్కారం అందుకున్న బైరపాక

రాయల్ పోస్ట్ దిన పత్రిక ప్రతినిధి భువనగిరి: మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన యువకవి, రచయిత బైరపాక స్వామి 2021 సంవత్సరంకు గాను ప్రతిభ పురస్కారం అందుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో ప్రజాకవి, వాగ్గేయకారుడు, తెలంగాణ శాసన మండలి సభ్యులు డా. గోరటి వెంకన్న చేతుల మీద యువకవి, రచయిత బైరపాక స్వామికి ప్రతిభ పురస్కారం- 2021 అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళా పీఠం పదవ వార్షికోత్సవ వేడుకల్లో ఈ పురస్కారం అందజేసినట్లు సంస్థ వ్యవస్థాపకులు చిక్కరామదాస్ తెలిపారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ బైరపాక స్వామి సాహిత్యంలోనూ, పాటల రచనలోనూ రాణిస్తూ సమాజ సేవ కూడా చేయడం నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డా. ఓలేటి పార్వతీశం, దైవజ్ఞశర్మ, నేటినిజం సంపాదకులు బైస దేవదాసు, డా, ఎంపర్ల బుచ్చిరెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, పట్టాల అశోక్, చిక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ పురస్కారం అందుకున్న ప్రముఖ కవి, రచయిత బైరపాక స్వామికి అమ్మనబోలు సర్పంచ్ నర్మద, ఎంపీటీసీ పోలేపాక జ్యోతిలక్ష్మీ స్వామి, మాజీ ఎంపీటీసీ నాయిని రాంచంద్రారెడ్డి, ఉపసర్పంచ్ నల్లమాస విశ్వనాధం,
తాల్క ట్రస్టు (భరత్ కుమార్ మెమోరియల్ సంస్థ అభినందనలు తెలిపారు.