రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోచంపల్లి పట్టణంలోని వడ్ల కొనుగోలు కేంద్రంని(I.K.P సెంటర్) సందర్శించి రైతుల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్బంగా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు స్పందిస్తూ వారం రోజుల క్రితం అట్టహాసంగా కొబ్బరి కాయలు కొట్టి I.K.P సెంటర్ ప్రారంభించారు కానీ ఇంతవరకు ఒక్క వరి గింజ కూడా రైతుల నుండి కొనుగోలు చేయలేదు అని వాపోయారు. ఇదే సంధర్బంగా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక నుండి రైతు సమస్యల మీద జిల్లా స్థాయిలో కార్యాచరణ ఉంటుంది అని ఇందులో భాగంగా నే మండల కేంద్రాలలో ఆందోళనలు చేపట్టడం మరియు సంబంధిత అధికారులకు లేఖను సమర్పించడం చివరగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ కి లేఖను అందజేయడం ఉంటుదని అన్నారు.