వరి ధాన్యం కోనుగోలులో నిర్లక్ష్యం వహించరాదు. – CPI బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్,

ఎస్ ఎస్ కె సుభాన్ పాష రిపోర్టర్ బెల్లంపల్లి: CPI రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయం ముందు ధార్న నిర్వహించి ఆర్ డి ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది… ఈ సందర్భంగా CPI బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంట వేయవద్దు అనడం అవివేకం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కోనుగోలులో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.. తద్వారా రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని అన్నారు… బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమంటున్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల చేతికొచ్చిన పంటను కొనడంలో జాప్యం చేయకూడదని అన్నారు.లేని ఏడల రాష్ట్ర వ్యాప్తం నిరసన కార్యక్రమం చేస్తామని అన్నారు..

ఈ కార్యక్రమంలో

చిప్ప నర్సయ్య – సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు,
గుండ చంద్ర మాణిక్యం – సిపిఐ పట్టణ కార్యదర్శి, బొంతల లక్ష్మీనారాయణ – సిపిఐ పార్టీ మండల కార్యదర్శి,
కోండు బానేష్ – సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి,
మేకల రాజేశం, అక్కేపల్లి బాపు – సిపిఐ జిల్లా సమితి సభ్యులు