భువనగిరి టౌన్(రాయల్ పోస్ట్ తెలుగు దిన పత్రిక) :ఈ నెల 16 17 18 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జయప్రదం చేయాలని ముద్రించిన వాల్పోస్టర్ బోనగిరి టౌన్ లో అవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎన్నికల ముందు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తానని పర్మినెంట్ చేస్తానని చెప్పిన మాటలు నేటికి అమలు చేయలేదని అన్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి విధానాలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో సైజు పట్టణ కన్వీనర్ బాలకృష్ణ కొండయ్య నరసింహ వరమ్మ శాంతమ్మ కుమారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.