భువనగిరిటౌన్ ( రాయల్ పోస్ట్ దిన పత్రిక) ప్రతినిధి: వికలాంగుల బందు పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి వికలాంగుల కుటుంబానికి 12 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వాలి- జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురు రంగా ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్ చేశారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజల కంటే వికలాంగులు చాలా వెనుకబడి ఉన్నారని వారు ఆర్థిక సాధికారత సాధించేందుకు వికలాంగుల బందు పథకాన్ని ప్రకటించి ప్రతి వికలాంగుల కుటుంబానికి 12 లక్షల 50 వేల రూపాయలను అందివ్వాలని కోరారు. ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, అంత్యోదయ రేషన్ కార్డుల ద్వారా ప్రతి వికలాంగుల కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వికలాంగుల పెన్షన్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల యాదాద్రి పుణ్యక్షేత్రం లో కార్తీక్ గౌడ్ అనే వికలాంగుల పై పోలీసులు దాడి చేయడం వల్ల మరణించిన విషయం అందరికీ తెలిసిందే మృతికి కారణమైన టెంపుల్ పోలీసులను ఉద్యోగం నుండి వెంటనే తొలగించాలని ఆయన కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. అనంతరం కలెక్టర్ పరిపాలన అధికారికి కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షు కిసరి వెంకటరెడ్డి , బొల్లేపల్లి స్వామి జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత కో కన్వీనర్ పద్మ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనర్సింహారెడ్డి, రేణుక కొండల్ జాంగిర్ వాలు జిల్లా నాయకులు శంకర్ ఆడెపు రాజశేఖర్, కార్యదర్శి నాగరాణి పిట్��