రాయల్ పోస్ట్ అంబర్ పేట : నియోజక వర్గం నుంచి భారీగా తరలి వెళ్లిన టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జనసమీకరణ చేసి ధర్నాకు బయల్దేరారు అనంతరం ఎడ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత చూపుతున్నారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడిచి రైతులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు విమర్శించే హక్కు బండి సంజయ్ కి లేదని తక్షణమే సీఎం కేసీఆర్ కి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు……