గిరిజనుడిపై దాడి చేసిన ఎస్సె లింగంపై వేటు

సూర్యాపేట :దొంగతనం కేసులో విచారణ పేరుతో గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ( ఎస్ ) ఎస్సై లింగంపై వేటు పడింది . లింగంను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు . గతంలోనూ ఈయన ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి . ఉప్పల్ ఎస్సైగా పనిచేసిన లింగం .. ఓ కేసులో సస్పెండ్పై సూర్యాపేటకు బదిలీ అయ్యారు.లాక్డౌన్లో ఓ నర్సు భర్తపై చేయి చేసుకోవడం సంచలనమైంది .