నస్పూర్, : శ్రీరాంపూర్ ఏరియాలోని మూడో గనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల అంత్యక్రియలు కుటుంబ సభ్యు లు, బంధువుల కన్నీటి మధ్య వివిధ ప్రాంతాల్లో గురు వారం ఉదయం జరిగాయి. గని పైకప్పు కూలిన ప్రమాదంలో బండ కింద చిక్కుకున్న మృతదేహాలను బుధవారం రాత్రి వెలుపలికి తీసుకువచ్చి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అర్ధరాత్రి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా వారివారీ స్వగ్రామా లకు తరలించారు. ఒంటెల క్రిష్ణారెడ్డి (ఆర్కే-8 కాల నీ), రెంక చంద్రశేఖర్ (జన్నారం మండలం తొమ్మిది గుడిసెలపల్లె), గడ్డం సత్య నర్సింహారాజు (కొత్తగూ డెం జిల్లా ఎల్లందు), బేర లచ్చయ్య (షిర్కే కాలనీ)లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. బేర లచ్చయ్య అంత్యక్రియలు స్వగ్రామమైన హాజీపూర్ మండలం నంనూరులో చేశారు.

నివాళులర్పించిన యూనియన్ల నేతలు
నస్పూర్‌లోని గోదావరికాలనీ షిర్కేలో బేర లచ్చ య్య, ఆర్కే-8 కాలనీలో ఒంటెల కిష్ణారెడ్డిల నివాసా లకు గురువారం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీ యూసీ, బీఎంఎస్ నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబా లను ఆదుకుంటామని, వారికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా, మ్యాచింగ్ గ్రాంట్స్, ఆదనంగా ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్రావు అన్నారు. టీబీజీకేఎస్ నేతలు మల్లారెడ్డి, సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంగల కుమారస్వామి, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, పిట్ కార్యదర్శులు ఉన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి బాజీసైదా, బ్రాంచీ నాయకులు కొమురయ్య, మల్లేష్, ఐఎన్టీ యూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు, బీఎంఎస్ సెంట్రల్ వైస్ ప్రసిడెంట్ పేరం రమేష్, గరిగె స్వామి, రాజయ్య, మహేందర్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ
శ్రీరాంపూర్ మూడో గనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికులకు గురువారం సింగరేణి యాజమాన్యం ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేసింది. ఒక్కొక్కరి రూ.15.90 లక్షల ఎక్స్‌గ్రేషి యాతోపాటు ఐదు వేల రూపాయలను ఖర్చుల కింద అందించారు. వెల్పేర్ ఆఫీసర్లు సంతన్, సునిల్, ప్రకాష్ రావులు ఆయా ప్రాంతాల్లో జరిగిన అంత్యక్రి యలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్
శ్రీరాంపూర్ ఏరియాలోని మూడో గనిలో బుధవా రం పైకప్పు కూలిన సంఘటన స్థలాన్ని గురువారం సింగరేణి ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం పరిశీలించారు. మ్యాన్ రైడింగ్ ద్వారా వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. డైరెక్ట ర్‌తోపాటు జనరల్ మేనేజర్ సురేష్, టీబీజీకే ఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏరియా సర్వేయర్ రాఘవేంద్రరావే, ఏజెంట్ నర్సింహారావు, స్ఓటు ఫైనాన్స్ డైరెక్టర్ రవి ప్రసాద్ ఉన్నారు.