కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నా

రాయల్ పోస్ట్ హైదరాబాద్: టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి దశరథ్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలుస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత చూపకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ధర్నాకు ఎలాంటి అనుమతి లేదు అంటూ విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు