చిత్తూరు:ఈశాన్య రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..

◆దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు తితిదే ప్రకటించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రెండు కనుమదారుల్లో చెట్లు, కొండచరియలు విరిగిపడుతున్నాయి..

సాయంత్రం నుంచి వర్షం ఉద్ధృతి మరింత పెరగడంతో కనుమదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది..

◆రెండో కనుమదారిలో 14వ కిలోమీటరు వద్ద, దిగువ ఘాట్‌ రోడ్‌లో రెండో మలుపులో రహదారిపై బండరాళ్లు పడ్డాయి.

◆జేసీబీల సాయంతో బండరాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

కనుమదారుల్లో మరింతగా కొండ చరియలు పడే అవకాశం ఉండటంతో రాత్రి 8గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు ఘాట్‌ రోడ్లను మూసివేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు..

◆భారీ వర్షాల కారణంగా తిరుమలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

◆రాత్రి 7.30 గంటల నుంచి బస్‌ టికెట్ల జారీ నిలిపివేశారు.

వాతావరణం అనుకూలించిన తర్వాతే బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు..