హైదరాబాద్:అంబర్ పేట్ శంకరన్న, పహిల్వాన్ గుంటి శ్రీనులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ శంకరన్న కష్టకాలంలో ఉన్న ఎంతోమందికి అండగా నిలబడి కష్టసుఖాలు పంచుకున్న వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంచి మనిషని ఒక మంత్రికి చే కాని పనులు కూడా శంకరన్న అవలీలగా సహయార్థులకు చేసి పెడుతున్న ఘనత తన సొంతమని, రాష్ట్రంలో కరోన సమయంలో వేలమందికి నిత్యవసార వస్తువులు బియ్యం ప్రజలకు పంచి తన ఉదారత తో అదుకున్నారని ప్రతి రోజు పనుల కోసం ఎంతో మంది వస్తున్నా విసుగు పడకుండా వారికి సేవ చేస్తూ తన గొప్ప తనాన్ని చాటుకుంటున్నారని ఏ పదవి లేకుండానే ఎంతో మందికి న్యాయం చేస్తున్న శంకరన్నకు అధికార పదవి ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అధికారికంగా అందించగలరని కావునా వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో అంబర్ పేట నియోజకవర్గం నుండి శంకరన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాజకీయ పార్టీలను కోరుతున్నామన్నారు లేనిచో స్వతంత్ర అభ్యర్థి గా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని టీఆర్ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ తెలియచేసారు

కార్యక్రమంలో మెట్టుగూడా పహిల్వాన్ గుంటి శ్రీను, ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జోగు ఆంజనేయులు, ఎర్రాముల రవి,నాయకులు నాగరాజు, లింగస్వామి, పిట్టల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు