హైదరాబాద్ :వివేకానంద నగర్ లో గత కొంతకాలంగా డ్రైనేజీ లైన్లు కోసం ఇష్టానుసారంగా రోడ్లను తవ్వి గాలికి వదిలేసిన అధికారులు ఎన్ని సార్లు అధికారులు కు ప్రజా ప్రతినిధులు కు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారికి తమ రోడ్లన్నీ మురుగుతో నిండుపుతున్నాయని తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయాన దృష్టికి తీసుకురాగా వెంటనే వివేకానంద నగర్ కూన శ్రీశైలం గౌడ్ గారు చేరుకుని వెంటనే ghmc అధికారుల కు మరియు వాటర్ వర్క్స్ అధికారులు కు మాట్లాడి చాలా రోజుల నుంచి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని వారిని కోరారు.బస్తీలలో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని లేక పోతే ప్రజలు తరుపున మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని కూన శ్రీశైలం గౌడ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.