భువనగిరి లో ని స్థానిక జలీల్ పుర లో ఖదీమ్ జామియా ఇస్లామియా అరేబియా స్కూల్ లో భారత్ దేశ మొదటి విద్య శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు..ఈ సందర్బంగా వార్డ్ కౌన్సిలర్ నాజిమ నస్రీన్ సలావుద్దీన్ గారు ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగిస్తూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశిష్ట స్వాతంత్ర్య సమరయోధుడని అన్నారు. నిజమైన దేశభక్తుడు మౌలానా ఆజాద్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.విద్యా మంత్రిగా మౌలానా ఆజాద్ భారతదేశంలో బలమైన విద్యా వ్యవస్థకు పునాది వేశారు, ఇది ఇప్పటికీ విద్యను ప్రోత్సహించడంలో కీలకంగా ఉంది. విద్యార్థులు కష్టపడి చదివి చదువుతోనే భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని కోరారు.విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం ధ్యేయమని, అదే లక్ష్యంతో వార్డులో అభివృద్ధి పనులతో పాటు పేద విద్యార్థులలో విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు విద్యాసామగ్రి అందజేస్తున్నామని.. భవిష్యత్తులో కూడా విద్యార్థులను ఆదుకుంటామని అన్నారు స్కూల్ కమిటీ అధ్యక్షుడు షేక్ మీరాన్ చౌదరి అధ్యక్షోపన్యాసం చేస్తూ . మౌలానా ఆజాద్ నిజమైన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశభక్తుడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు నిజమైన దేశభక్తుడు మరియు దేశానికి స్వాతంత్ర్యంతో పాటు, స్వతంత్ర భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి, మౌలానా ఆజాద్ గొప్ప మేధావి, పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. అతను దేశం లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను స్థాపించాడు మరియు ఘోరఖ్‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయార్ టెక్నాలజీ నీ స్థాపించారు అనేక భాషల్లో లో ఆయన నిష్ణాతుడు ۔ 1947 నుండి 1958 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆజాద్ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు విద్యారంగంలో శాస్త్ర సాంకేతిక పెంపునకు విశేష కృషి చేశారు 1921లో సహాయ నిరాకరణ 1930 శాసనోల్లంఘన 1942 క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. హిందూ ముస్లింల ఐక్యతే దేయంగా ఆల్ హిలాల్ పేరు తో పత్రికను స్థాపించారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించడంతో అల్ బ్లాగ్ పేరు తో మరో పత్రికను ప్రారంభించారు పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు మరణానంతరం అయినా చేసిన సేవలకు గాను. 1992లో భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు ఆయనకు లభించింది జాతీయ సమైక్యత కు ప్రతీకగా నిలిచిన మౌలానా ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న మరణించారు. ఆయన ఆశయ సాధన లక్ష్యంగా విద్యార్థులు చదువులో రాణించాలని అన్నారు. అనంతరం 200మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని స్థానిక కౌన్సిలర్ సాల్లావుద్దీన్ తన సొంత నిధులతో అందించారు. ఈ కార్యక్రమంలో లో స్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇర్షాద, కోశాధికారి అతీక్, సహాయ కార్యదర్శి కబీర్, రహీం, సుజావుద్దీన్. ఫైజుద్దీన్. సాజిద్. తదితరులు పాల్గున్నారు