రాయల్ పోస్ట్ మంచిర్యాల ; వానకాలం పంట 2021-22 సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయుటకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో 198 కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రాధమికంగా ఖరారు చేయడం జరిగిందని, అలాగే రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యవం తమైన సేవలు అందించడానికి మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడంతో పాటు, వాన నుంచి రక్షణకు తగినన్ని టార్పాలిన్లు, ధాన్యం నిల్వ చేయుటకు గోనె సంచులు కేంద్రాల వద్ద ఉంచడం జరుగుతుందని తెలిపారు. దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.