రాయల్ పోస్ట్ భువనగిరి: ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది👉ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారు ఈ దేశ మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రి గా స్వాతంత్ర సమరయోధులుగా, భారతరత్న బిరుదు పొందినటువంటి మహనీయులని, స్వాతంత్ర్యానంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వారు తీసుకున్న సంస్కరణలతో నాడు 15 శాతం ఉన్న అక్షరాస్యత నేడు 25 శాతం వరకు వెళ్లగలిగినదంటే అది నాడు వారు చేసిన కృషి ఫలితమే అని చెప్పక తప్పదని, ఈ భూమి ఉన్నంత వరకు వారి సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని, 35 సంవత్సరాలకే వారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనారని, వారు ముందుచూపుతో ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలను నేడు ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నారని, కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ దేశంలో ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులే అనే విషయాన్ని బిజెపి పార్టీ గుర్తుంచుకోవాలని, ప్రాంతీయతత్వంతో టీఆర్ఎస్ పార్టీ, జాతి విభేదాలు సృష్టించి విభజించి పాలించాలని చూస్తున్నారని, ఈ పార్టీలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ.. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నేటికీ ఘనంగా జరుపుతున్నామని అన్నారు.ఆయన 1888లో నవంబర్ 11న మక్కా లో జన్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసు కుంట్ల సత్యనారాయణ pcc మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి md.mazhar ఎండి రఫీ ఉద్దీన్ గౌరీ md.సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ ఎండి అబిద్ అలీ md.ejas కూర వెంకట్ చిక్కుల వెంకటేశం తాడూరి నరసింహ నిరంజన్ ఎడ్ల శ్రీనివాస్ ఎండి కబీర్ ఎండి అజహర్ taduri balraj తదితరులు పాల్గొన్నారు