గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు జాయింట్ సి పి రమేష్ రెడ్డి నేతృత్వంలో ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ మరియు దుర్గానగర్ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించబడింది…

రాయల్ పోస్ట్ హైదరాబాద్ :రమేష్ రెడ్డి నేతృత్వంలో ఈస్ట్ జోన్ ఏసిపి వెంకటరమణ, నలుగురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 150 పోలీస్ సిబ్బంది ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు..
ఈ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 37 ద్విచక్ర వాహనాలను, ఏడు ఆటోలను, అక్రమంగా గుట్కా మరియు విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న షాప్ యజమానులను అదుపులోకి తీసుకొని 1000 గుట్కా ప్యాకెట్లు విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు జాయింట్ సీపి రమేష్ తెలిపారు…