రాయల్ పోస్ట్ భువనగిరి : స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండీ అమానతుల్లా ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.ముందుగా అబుల్ కలామ్ ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పేదలకు బ్రెడ్డు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గార్లు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధునిగా, బహుభాషా వేత్త గా ,తొలి భారత దేశ విద్యా శాఖ మంత్రి గా వారు చేసిన సేవలు అమూల్యమైనవి అని ,అన్ని సామాజిక రుగ్మతలను అసమానతలను బహిరంగంగా వ్యతిరేకించి తనకు తాను ఆజాద్ గా ప్రకటించుకున్న గొప్ప ధీశాలి అబుల్ కలాం గారని, అందరం వారు చూపిన మార్గంలో నడవాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు కార్యకర్తలు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కైరంకొండ వెంకటేష్, పడిగెల రేణుక ప్రదీప్, ఎండి నాజిమా సలావుద్దీన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, ఎండీ బాబా, ఎండీ కబిర్, వడిచర్ల శరత్, మాటూరి బాలేశ్వర్, గట్టు కృష్ణమూర్తి, బింగి భాస్కర్ సాల్వే రూ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.