రాయల్ పోస్ట్ ఖమ్మం :స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జిల్లా TRS పార్టీ కార్యాలయం(గట్టయ్య సెంటర్) నందు ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.

విద్య ద్వారానే వికాసం లభిస్తుంది అని నమ్మిన సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు ఏర్పడి పేద, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందుతుందని అన్నారు.

నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.