రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో
29వ తాటేపల్లి గోపాలకృష్ణ మెమోరియల్ చెస్ టోర్నమెంట్

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చెస్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించనున్నా రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి (నగతు బహుమతి) వై యస్ ఆర్ గార్డెన్ నందు 13-11-2021 న నిర్వహించడం జరుగుతుంది. దీనికి పేర్లు నమోదుకు చివరి తేది 13-11-2021 ఉదయం 9:00 గంటల వరకు. 10:00 డ్రా తీసి టోర్నమెంట్ మొదలు అవుతుంది.దీనికి ఎలాంటి రుసుము లేదు.
కావున సమస్త పాఠశాలల విద్యార్థులు పాల్గొనవల్సిందిగా పత్రికాముఖంగా కోరడమైనది.
మొదటి ప్రైజ్ రు 5000, రెండవ ప్రైజ్ రు.3000,
మూడవ ప్రైజ్ రు.2000,
నాల్గవ, ఐదవ ప్రైజ్ ఒక్కొక్కరికి రు.1000
ఆరు నుండి పదవ వరకు ఒక్కొక్కరికి రు 500
11నుండి 20 వరకు ఒక్కొక్కరికి రు 300 చొప్పున ఇవ్వబడును. కావున అధిక సంఖ్యలో ఈ చెస్ పోటీలో పాల్గొంటారని ఆశిస్తన్నాము.
పోటీలో పాల్గొను విద్యార్థులు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి నుండి విద్యార్థి ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాలెను. లేనిచో పోటీలో అనర్హులు. పోటీలో పాల్గొను విద్యార్హులు టిఫిన్ లంచ్ బాక్స్ తీసుకొని రావలెను.