రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనబోమని చెబుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఈ నెల 12న ఇందిరాపార్క్ వద్ద “రైతు వేదన” నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. 72 గంటల పాటు జరగనున్న ఈ నిరాహార దీక్షకు పార్టీ అధికార ప్రతినిధులు, పార్లమెంట్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,యువజన విభాగం,దళిత, బీసీ, మైనారిటీ, గిరిజన విభాగం నాయకులు మీమీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో రైతులతో కలిసి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల గారు ఆదేశించారు. కావున పార్టీ నాయకులు రైతులతో పాటు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
