నేడు భువనగిరి పట్టణములోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయం యొక్క నిర్మాణ పనులను గౌరవ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్ కు తగిన సూచనలు జారీ చేసి ఇట్టి నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో చైర్ పర్సన్ శ్రీ ఎన్నబోయిన అంజనేయులు , జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా౹౹ శ్రీ జడల అమరెందర్ గౌడ్ , పట్టణ టి.ఆర్.ఎస్. అధ్యక్షులు మరియు 5వ వార్డు సభ్యులు శ్రీ అబోతుల కిరణ్ కుమార్ , వార్డు సభ్యులు శ్రీ దిడ్డికాడి భగత్ , శ్రీ జిట్టా వేణుగోపాల్ రెడ్డి , శ్రీ బానోతు వెంకట్ నర్సింగ్ నాయక్ , నాయకులు శ్రీ కొలుపుల అమరెందర్ , శ్రీ ఇట్టబోయిన గోపాల్ తదితరులు పాల్గొన్నారు.