రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:తెలంగాణ రాష్ట్రము లో అన్ని కులాలకు, మతాలకు రాజకీయ పదవులు ఇచ్చినట్లే క్రిస్టియన్ లకు కూడా రాజకీయ పదవులు ఇవ్వాలి అని తొగుట సంఘo రాష్ట్ర నాయకులు సి ఎచ్. మత్యాస్ కోరారు. ఈ సందర్బంగా జరిగిన జర్నలిస్ట్ ల సమావేశం లో మాట్లాడుతూ రాజకీయo గా ఎదుగుతున్న తమకు ఇతరులతో సమానం గా రాజకీయo గా తమకు కూడ పదవులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్నా ఎం ఎల్ సి వాటి లో తమకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు మెల్కిరాజు, ప్రేమ్, ఇన్నయ్య, సంతోష్, రవి కుమార్, చిన్నయ్య, మార్క్, జార్జ్,స్టాలిన్ పాల్గొన్నారు.