తాడూరి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి.

రాయల్ పోస్ట్ ప్రతినిధి బొమ్మలరామారం;

తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యమంత్రి కెసిఆర్ వెన్నంటే ఉండి టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని బొమ్మలరామారం మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి సంఘం నాయకులు బేతాళ శ్రీనివాసులు కోరారు మంగళవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు కుమ్మరుల ఓట్లతో గత ప్రభుత్వాలు పదవులు పొందారు తప్ప చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆయన ఆవేదన చెందారు తరాలు మారుతున్న కుమ్మర్ల తలరాతలు మారటం లేదని కుమ్మరులు ఓట్ల కే పరిమితం అవుతున్నారు తప్ప రాజకీయ పదవులకు అర్హులు కావడం లేదని ఆయన అన్నారు రాజకీయాల్లో చట్టసభలో ఎంతో మందికి అవకాశం కల్పించి అవకాశాలు ప్రసాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారి తాడూరి శ్రీనివాస్ కు అవకాశం కల్పిస్తే చట్టసభలలో కుమ్మరుల కు అవకాశం కల్పించిన యుగపురుషుడు గా రాజకీయ చరిత్రలో నిలుస్తారు అని ఆయన అన్నారు తప్పకుండా ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని రాష్ట్ర కుమ్మరులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.