రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:సమగ్ర సర్వేలో సమస్యల వెల్లువ# కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతోఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ గారు మాట్లాడుతూ మహిళలకు ఉపాధి లేక మహిళలు అర్థ ఆకలితో అనారోగ్యంతో జీవిస్తున్నారు అని అన్నారు. విద్య వైద్యం ఖరీదైన పోవడంతో కుటుంబంలో ఒకరు పని చేస్తూ మిగతా వారికి పని లేక మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు అని అన్నారు. మహిళలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మైక్రోఫైనాన్స్ ల ద్వారా రుణాలు తీసుకోవడం జరుగుతుంది అవి సరైన సమయానికి కట్టలేకపోగా అట్టి డబ్బులను దౌర్జన్యంగా వసూలు చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసరి మంజుల, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమడుగు నాగమణి, ఐద్వా నాయకురాలు హేమలత, తాడూరి కలమ్మ, మంజుల, అంజని తదితరులు పాల్గొన్నారు.