రాయల్ పోస్ట్ ప్రతినిధిబొమ్మల రామవరం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో ధర్మసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాతావరణ మార్పు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమం సంస్థ చైర్మన్ జె.నిశాంత్ రెడ్డి నిరవహించటం జరిగింది ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మానవాళి ప్రస్తుతo సంభవిస్తున్న వాతావరణ మార్పు పై అప్రమత్తం కాకపోతే జీవన మనుగడకే ప్రమాదం పొంచి ఉందని అన్నారు దానికి కారణమయ్యే భూతాపం పైన పలు సూచనలు చేశారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అడవలను చెరువులను సంరక్షించాలని నీటిని విద్యుత్ ని పొదుపుగా వాడాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుర్వీ గోవింద్ గౌడ్ సంస్థ సభ్యలు ధృవ్, కనిష్క్ , పలాష్ ఎంపీటీసీ బోయిని లత నర్సింహ సంస్థ ప్రతినిధి వేముల నరేష్ గ్రామ కార్యదర్శి గణేష్ గ్రామ పెద్దలు మోటే రమేష్ సిద్ధేంకి శ్రీనివాస్ ముడుగుల ఆంజనేయులు జగ్గర్ల ఆనంద్ గౌడ్ రాచకొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు